హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్).

సినిమా : OMG (ఓ మంచి ఘోస్ట్)
విడుదల : 21.06.24
బ్యానర్ : మార్క్ సెట్ నెట్‌వర్క్స్
దర్శకుడు: శంకర్ మార్తాండ్ నిర్మాత : డా.అబినికా ఇనాబతుని నటీ నటులు : వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

చాలా వ‌ర‌కు హార‌ర్ కామెడీ జాన‌ర్‌లో సినిమాల్లో క‌మెడియ‌న్లే స్టార్లు. వారు ఎంత‌గా న‌వ్విస్తే సినిమా అంత హిట్టు. న‌వ్వుల‌తో పాటు భ‌యం కూడా అదే మోతాదులో ఉండేలా క‌థ రాసుకుంటే సినిమాకు కాసుల వ‌ర్షం కురిసిన‌ట్లే.ఈ ఫార్ములాను ప‌ట్టుకొని ఎంతో మంది ద‌ర్శ‌కులు స‌క్సెస్‌ల‌ను అందుకున్నారు. ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో మూవీనే ఓ మంచి ఘోస్ట్‌.(OMG) . వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  జూన్ 21న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘OMG (ఓ మంచి ఘోస్ట్)’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ:
ఎమ్మెల్యే స‌దాశివ‌రావు(నాగినీడు) పోస్ట‌ర్ మీద పేడ కొట్టాడ‌ని చైత‌న్య‌(ర‌జ‌త్ రాఘ‌వ‌)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలులో ర‌జియా (న‌వ‌మి గాయ‌క్‌), ల‌క్ష్మ‌ణ్‌(న‌వీన్ నేని)తో పాటు పావురం (ష‌క‌లక శంక‌ర్‌)ల‌తో చైత‌న్య‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఈ న‌లుగురు క‌లిసి ఎమ్మెల్యే స‌దాశివ‌రావు కూతురు కీర్తిని (నందితా శ్వేత‌) కిడ్నాప్ చేస్తారు. ఊరి చివ‌ర ఉన్న పాడుబ‌డ్డ మ‌హాల్‌లో కీర్తిని దాచిపెట్టి ఎమ్మెల్యేను డ‌బ్బుల కోసం డిమాండ్ చేయాల‌ని అనుకుంటారు. పాడుబ‌డ్డ మ‌హ‌ల్‌లో అడుగుపెట్టిన చైత‌న్య‌, ర‌జియా, ల‌క్ష్మ‌ణ్‌తో పాటు పావురం ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయి, అందులోని ద‌య్యం న‌లుగురిని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. అందుకు కార‌ణం ఏమిటి? ఆ ద‌య్యం బారి నుంచి న‌లుగురు త‌ప్పించుకున్నారా? మేన‌మామ అయిన స‌దాశివ‌రావుపై చైత‌న్య ఎందుకు ప‌గ‌ను పెంచుకున్నాడు? కీర్తి వింత‌వింత‌గా  ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ మ‌హ‌ల్‌లోనే న‌లుగురు స్నేహితుల‌కు కంట‌ప‌డిన ఆత్మ (వెన్నెల‌కిషోర్‌) మ‌నిషా? ద‌య్య‌మా? బ్రిటీష్ కాలం నాటి ఆ మ‌హ‌ల్ చ‌రిత్ర ఏమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా OMG (ఓ మంచి ఘోస్ట్)‘సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
ఓ మంచి ఘోస్ట్‌లోప్ర‌త్యేకంగా హీరోలు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు స‌మానంగా ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు ఈమూవీని తెర‌కెక్కించాడు. ఆత్మ పాత్ర‌లో వెన్నెల‌కిషోర్ క‌నిపించే సీన్స్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. త‌న కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగ్స్‌తో మెప్పించాడు వెన్నెల‌కిషోర్‌. పావురం పాత్ర‌లో ష‌క‌ల‌క శంక‌ర్ డైలాగ్ మాడ్యులేష‌న్‌, హ‌డావిడి ఫ‌న్నీగా అనిపిస్తుంది. ద‌య్యంగా నందితా శ్వేత‌కు ఇలాంటి పాత్ర‌లు కొత్తేం కాదు. చాలా సినిమాల్లో చేసిన రోల్ కావ‌డంతోనే ఈజీగా క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకుంది. న‌వ‌మి గాయ‌క్ గ్లామ‌ర్‌తో మెప్పించింది. ర‌ఘుబాబు, న‌వీన్ నేని, ర‌జ‌త్ రాఘ‌వ్ కామెడీ కూడా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. అనూప్ రూబెన్స్ బీజీఎమ్ ఈ సినిమాకు బ‌లంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే కొన్ని చోట్ట భ‌య‌పెట్టాడు


సాంకేతిక నిపుణుల పనితీరు
పాడుబ‌డ్డ మ‌హ‌ల్‌లోకి ప్ర‌ధాన పాత్ర‌లు అడుగుపెట్ట‌డం, అందులోని ద‌య్యం వారిని చంపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం..వంటి  కాన్సెప్ట్‌తో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి aite  ఈ కాన్సెప్ట్ kathanu సీరియ‌స్‌గా కాకుండా కంప్లీంట్‌గా కామెడీతోనే చెప్పాల‌ని  లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి  ఆ సీన్స్ మొత్తం ఫ‌న్ వేలోనే రాసుకున్నారు డైరెక్ట‌ర్‌ .. ఇంట‌ర్వెల్‌లో కీర్తి క్యారెక్ట‌ర్ నేప‌థ్యంలో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క‌లిగించారు.సినిమా చూస్తున్నంత సేపు ఏమి జరుగుతుందా అని అనిపిస్తూ అడుగడుగునా ఆసక్తికరంగా ఉండేలా దర్శకుడు శంకర్ మార్తాండ్ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. మ‌హ‌ల్‌లోని ద‌య్యం బారి నుంచి న‌లుగురు త‌ప్పించుకోవ‌డానికి వేసే ఎత్తులు, వాటి నుంచి పండే కామెడీతో సెకండాఫ్ లో న‌వ్విస్తూనే భ‌య‌పెట్టించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు వెన్నెల‌కిషోర్‌ను ద‌య్యం అనుకొని మిగిలిన వారు భ‌య‌ప‌డే సీన్స్ లోని ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింది. .అనూప్  మ్యూజిక్ ee సినిమాకు హైలెట్ గా నిలిచింది.సౌండ్, విజువల్స్‌ అద్భుతం అని చెప్పచ్చు.సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ కెమెరా పని తనం బాగుంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ పని తీరు బాగుంది. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని  ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. OMG (ఓ మంచి ఘోస్ట్)..అనే టైటిల్ ఈ సినిమా నూటికి నూరు శాతం న్యాయం జరిగింది. ఓ హర్రర్‌ సినిమాకు ఉండాల్సిన అన్ని కోణాలు ఉన్నOMG (ఓ మంచి ఘోస్ట్).  ‘సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులకు డిజప్పాయింట్ చేయదని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

maamovie.com Review Rating 3.25/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *