ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ‘నింద’ మూవీ రివ్యూ

సినిమా :’నింద’
విడుదల తేదీ : 21.06.2024
బ్యానర్: ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
చయిత, దర్శకుడు మరియు నిర్మాత: రాజేష్ జగన్నాధం
నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు.
సంగీతం: సంతు ఓం కార్
కెమెరామెన్ : రమీజ్ నవీత్
ఎడిటింగ్: అనిల్ కుమార్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
సౌండ్ డిజైనర్: సింక్ సినిమా
పి.ఆర్.ఓ : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

హ్యాపీడేస్ తో పరిచయమైన వరుణ్ సందేశ్ లవర్ బాయ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా  ‘నింద’ అనే  మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  జూన్ 21న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నింద’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి
కథ:
బాలరాజు(ఛత్రపతి శేఖర్) పొలంలో క్యూ మధు (మంజు) శవం దొరకడంతో  పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు.ఈ ఇన్వెస్టిగేషన్ లో తప్పు చేసినట్లుగా డి. ఎన్ ఏ రిపోర్ట్  రావడంతో ఈ అమ్మాయిని బాలరాజే రేప్ చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు.ఈ కేసు సాక్షి ఆధారాల ప్రకారం జడ్జ్ సత్యానంద్ (తనికెళ్ళ భరణి ) అతడికి ఊరిశిక్ష విధిస్తాడు.కానీ ఆ కేసులో అతని నిర్ధోషి అంటూ బాధపడుతూ.. ఒక నిర్దోషికి శిక్ష పడుతుందనే బాధతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడు.  మరోవైపు జడ్జ్ సత్యానంద్ కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగం చేస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుకున్న అమాయకులను శిక్షల బారి నుంచి తప్పించడానికి పనిచేస్తుంటాడు. అయితే సాక్షాల ఆధారంగా ఒక నిర్దోషికి శిక్ష విధించినట్లు వేవేక్ కు చెప్పి చనిపోతాడు. ఈ క్రమంలో ఆ కేసును టేకప్ చేసిన వివేక్.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు? అసలు ఈ కేసులో ఉన్న ముఖ్యులు ఎవరు.?. ఎలా వివేక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దలను ఎలా ఎదిరించి పోరాడాడు.?. చివరకు ఏమైంది అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా  ‘నింద’ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
వరుణ్ సందేశ్‌లో ఈ సినిమాలో తన నటనతో వావ్ అనిపించాడనే చెప్పోచ్చు. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కు వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.అన్నీ, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
వంద మంది దోషులు తప్పించుకున్నా.. ఒక నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు.. అనే కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చినా . నిందా సినిమాను  డిఫరెంట్ గా రాసుకొని ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో  ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా కొనసాగిస్తూ  తనదైన ట్విస్టులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. కథ పాతదైనా ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగినా..ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ  సెకండాఫ్ పై క్యూరియాసిటీ కలిగెలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.నటీనటులతో మంచి నటన రాబట్టుకున్నాడు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు. రమిజ్  కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు.ఎడిటర్ అనిల్ కత్తెరకు మరింత పదును పెడితే ఇంకా బాగుండేది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం  ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న “‘నింద’ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కచ్చితంగా చెప్పవచ్చు

maamovie.com Rating 3.25/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *