గుర్తుండిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ “విరాజి” మూవీ రివ్యూ!!
మూవీ : “విరాజి”
బ్యానర్ : ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
రివ్యూ రేటింగ్ : 3. 5/5
విడుదల తేదీ : 02.08.2024
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు…
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
పి ఆర్ ఓ: పాల్ పవన్
మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు అందుబాటు టికెట్ రేట్లతో “విరాజి” థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. సింగిల్ స్క్రీన్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125 గా టికెట్ రేట్లు పెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ‘విరాజీ ’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం
కథ
కొండమీద మూసివేయ బడ్డ ఆ పిచ్చాసుపత్రికి లోకి ఓ పది మంది వ్యక్తులు వస్తారు .అక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్ పేరుచెప్పి తమను పాడుబడ్డ ఓ పిచ్చాసుపత్రిని తీసుకొని వచ్చారని తెలుసుకొంటారు.అప్పుడు వారందరూ ఇక్కడకు మోసపోయి వచ్చామని తెలుసుకొని బయటపడడానికి ప్లాన్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు ఉండదు, మొబైల్ లో సిగ్నల్స్ ఉండవు.ఆ తర్వాత వీరు బయటపడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఇంకొకరు దారుణ హత్యకు గురవుతూ వుంటారు. ఈ టైంలో ఆండీ (వరుణ్ సందేశ్) కూడా మిగతా వారి లాగే ఆ పిచ్చాసుపత్రిలోకి రావడం జరుగుతుంది. ఆండీ వచ్చిన తర్వాత… ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు జరిగాయి ? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? పోలీస్ స్టేషన్ లో చనిపోయిన సాగర్ కు కొండమీద మూసివేయబడ్డ పిచ్చాసుపత్రికి లో ఉన్న వీళ్లకు సంబంధం ఏంటి ? చివరకు ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బయటపడ్డారు ? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “విరాజీ” సినిమా చూడాల్సిందే!!
నటీ నటుల పనితీరు
మొన్నటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ … ఈ సినిమాలో రిచ్ కిడ్ గా . సొసైటీలో పలుకుబడి ఉన్నవారి వారసుడిగా . ఆండీ అనే ఓ డిఫరెంట్ రోల్ లో నటించాడు. తలకు రంగు, చెవికి పోగు, సిగరెట్ తాగి నల్లబడిన పెదాలు..ఇలా వరుణ్ కొత్తగా కనిపించడమే కాకుండా ప్రేక్షకులను పూర్తి ఎంటర్టైన్ చేశాడని చెప్పచ్చు . సి.ఐ మురళి పాత్రలో నటించిన బలగం జయరాం చాలా చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయినా… బాగా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆర్టిస్టులు ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
‘విరాజి’ అంటే శివుడు.విరాజి’ అంటే చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడు అని అర్థం.సొసైటీలో ఉన్న ఒక్క కాంటెంపరరి ఇష్యూని తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించడం జరిగింది.ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగిస్తూ కథ, కథనాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తన మ్యూజిక్ తో పది రెట్ల ఇంపాక్ట్ ‘విరాజి’కి తీసుకొచ్చాడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ ఎంత హైలైట్ గా ఉన్నాయో , మ్యూజిక్ కూడా అంతే హైలైట్ అవుతుంది. ఎమ్ 3 మీడియా, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు పుష్కలంగా ఉన్న…. ‘విరాజి’ సినిమాను చూసి బయటకు వచ్చేప్పుడు ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయని కచ్చితంగా చెప్పచ్చు
maamovie.com
Review Rating 3.5/5