డిఫరెంట్ లవ్ ఎంటర్ టైనర్ “పాగల్ వర్సెస్ కాదల్” మూవీ రివ్యూ!!!
మూవీ : “పాగల్ వర్సెస్ కాదల్”
బ్యానర్ – శివత్రి ఫిలింస్
నిర్మాత – పడ్డాన మన్మథరావు
రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి
ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి.
సినిమాటోగ్రఫీ – నవధీర్
మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల
నటీనటులు –
విజయ్ శంకర్,
విషిక
బ్రహ్మాజి
షకలక శంకర్
ప్రశాంత్ కూఛిబొట్ల
అనూహ్య సారిపల్లి
ఆద్విక్ బండారు, తదితరులు
మనం డైలీ లైఫ్ రొటీన్ గా గడుపుతూ స్ట్రెస్ పిల్ అవుతుంటాం అలాంటి టైమ్ లో మంచి ఎంటర్ టైనింగ్ మూవీ చూస్తే స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతాం. ప్రమోషనల్ కంటెంట్ తో అలాంటి స్ట్రెస్ ఫ్రీ చేసే సినిమా అనిపించింది పాగల్ వర్సెస్ కాదల్. విజయ్ శంకర్ హీరోగా విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజేశ్ ముదునూరి ఈ సినిమాను రూపొందించారు. శివత్రి ఫిలింస్ బ్యానర్ లో యంగ్ ప్రొడ్యూసర్ పడ్డాన మన్మథరావు నిర్మించారు. ట్రైలర్ లో ఉన్న ఫన్ సినిమాలో ఎంతగా ఉందనేది “పాగల్ వర్సెస్ కాదల్” రివ్యూ చూద్దాం
కథేంటంటే
విశాఖ నేపథ్యంగా సాగే చిత్రమిది. కార్తీక్ (విజయ్ శంకర్) మంచి అబ్బాయి. అతను సివిల్ ఇంజినీర్ గా పనిచేస్తుంటాడు. ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూడగానే లవ్ చేస్తాడు. ప్రియ మాత్రం డిఫరెంట్ అమ్మాయి. చెడు ఉద్దేశం లేకున్నా అబ్బాయిలతో సరదాగా మాట్లాడుతుంటుంది. కానీ సైకోలా బిహేవ్ చేస్తుంటుంది. కార్తీక్ అంటే ఇష్టపడినా అతన్ని టెస్ట్ చేసేందుకు నానా ఇబ్బందులు పెడుతుంటుంది. ప్రియ చేసే పనులన్నీ భరిస్తూ ఆమెను ప్రేమిస్తుంటాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్. అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ యాక్సెప్ట్ చేయడు. అతనిది కూడా సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలవుతుంటాడు. ఇన్నోసెంట్ కార్తీక్, అతని సోదరి అమృత, కొంచెం తేడా బిహేవియర్ ఉన్న ప్రియ, ఆమె బ్రదర్ మనోజ్ ప్రేమలో ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ. ఈ కథంతా ఇద్దరు పోలీసులు షకలక శంకర్, బ్రహ్మాజీ ద్వారా నెరేట్ కావడం హిలేరియస్ గా ఉంటుంది.
ఎలా ఉందంటే
కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్ అనే నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ ను వేటికవి భిన్నంగా డిజైన్ చేశాడు దర్శకుడు రాజేశ్. వారి క్యారెక్టర్స్ లోని కొత్తదనమే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మార్చింది. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ క్యారెక్టర్ కమెడియన్ సునీల్ క్యారెక్టర్ లా మూవీ అంతా ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రేమ కథల్లో ఓ భిన్నమైన ప్రయత్నమిది. ఇవాళ్టి జనరేషన్ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. కొందరు అమ్మాయిలు అబ్బాయిలు తమనే ప్రాణంగా చూసుకోవాలని, తమకంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదనేట్లు బిహేవ్ చేయాలని కోరుకుంటారు. ఈ క్రమంలో శాడిజం చూపిస్తుంటారు. ఆ శాడిజం భరించేవరకు బాగానే ఉంటుంది. ఈ కథకు మూలమైన పాయింట్ కూడా అదే. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అనే మంచి మెసేజ్ కూడా పాగల్ వర్సెస్ కాదల్ మూవీలో ఉంది.
కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ నటన పీక్ లెవెల్లో ఉంది. అమాయకుడైన యువకుడిగా ఆకట్టుకునేలా నటించాడు విజయ్ శంకర్. అతను ఇంకా ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేయగలడనే నమ్మకాన్ని ఇస్తుందీ సినిమా. ఇక ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని టాప్ లెవెల్లో చూపించింది. చేతబడి కూడా నేర్చుకోవడం ఆమె క్యారెక్టర్ లోని శాడిజానికి పరాకాష్ట. అమృతగా అనూహ్య సారిపల్లి ఆకట్టుకుంది. మంచి చెల్లిగా బాగుంది అనిపించింది. శాడిస్ట్ సైకియాట్రిస్ట్ గా మనోజ్ పాత్రలో మెప్పించాడు ప్రశాంత్.
ప్రవీణ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిర్మాత పడ్డాన మన్మధరావు ఈ సినిమాకు ప్యాషనేట్ గా నిర్మించినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజేశ్ ప్రతిభ కనిపించింది. కాసేపు అన్నీ మర్చిపోయి థియేటర్ లో రిలాక్స్ కావాలంటే పాగల్ వర్సెస్ కాదల్ చూసేయండి.
maamovie.com
Review Rating : 3.25/5