మత్స్యకారుల జీవితాలకు అద్దంపట్టే “రేవు” మూవీ రివ్యూ!!!
మూవీ : “రేవు”
బ్యానర్స్ : సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్స్ సినిమా
విడుదల తేదీ : 23.08.2024
నిర్మాతలు : డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి,
రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.
నిర్మాణ సూపర్ విజన్ : జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : పర్వతనేని రాంబాబు,
ఆర్టిస్టులు : వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు
డి ఓ పి – రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం– వైశాక్ మురళీధరన్,
పాట– జాన్ కె జోసెఫ్,
ఎడిటర్ – శివ శర్వాని,
కళ- బాషా
సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 23న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రేవు”ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ ..
సముద్రతీర ప్రాంతంలోని రేవుల దగ్గర చేపలుపడుతూ జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు.అలాంటి మత్స్యకారుల జీవితాల్లోని ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని తీసిన చిత్రమిది. పాలరేవు అనే గ్రామంలో నివసించే అంకాలు (వంశీ పెండ్యాల) గంగయ్య (అజయ్ ) అనే ఇద్దరు మత్స్యకారుల మధ్య జరిగే కథ .అయితే వీరిద్దరిలో ఎవరు చేపలు బాగా పడతారు అనే పోటీ రోజూ ఏర్పడుతుంది. ఇలా ఈ పోటీ విషయంలోనే ఇద్దరు మధ్య మనస్పర్ధలు, గొడవలు జరుగుతుంటాయి..ఇకపోతే ఊహించని విధంగా వీరి జీవితాలలోకి ధనవంతుడైన నాగేసు (యేపూరి హరి) తన కొత్త పడవతో గ్రామానికి రావడంతో పరిస్థితి ఊహించని మలుపు తిరుగుతుంది.ఈ పడవ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇలా నాగేసు రాకతో అక్కడున్న మత్స్యకారులు అంకాలు ,గంగయ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు
అజయ్, వంశీ, హేమంత్, ఆంటోనీ తమ క్యారెక్టర్స్ ను అద్బుతంగా పోషించారు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పాలి. నవీన్ చాలా సహజసిద్ధంగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. జాలరి పాత్రలో నవీన్ ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా డైలాగ్స్ చెప్పడం ఆయన హావభావాలు పలికించడం అద్భుతంగా చేశారు. సుమేష్ మాధవన్,,హేమంత్ ఉద్భవ్ ల విలనిజం డిఫరెంట్ గా వుంది. ఆర్టిస్టులందరూ నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. అజయ్ స్వాతి భీమిరెడ్డి ఇలా మిగిలిన తారాగణం మొత్తం వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ఇలా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.కానీ సముద్ర తీర ప్రాంతాలలో నివసించే ఒక జాలరీ జీవితం ఎలా ఉంటుందనే కథతో పాటు ఒక జాలరి భావోద్వేగాలు ఎలా ఉంటాయానే వాస్తవిక అంశాలతో అందంగా చిత్రీకరించినందుకు దర్శకుడిని మనం అభినందించాలి. మొదటి భాగంలో అంకాలు గంగయ్య పాత్రలతో సరదాగా సాగిపోయింది.ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడుగా హరినాథ్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. డైలాగ్స్,విజువల్స్ బాగున్నాయి.వైశాఖ్ మురళీధరన్ నేపథ్య సంగీతం పర్ఫెక్ట్. రేవంత్ సాగర్ కెమెరా పనితీరు బాగుంది. శివ శర్వాని ఎడిటింగ్ పనితీరు డీసెంట్ గా వుంది ..సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా కలసి నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. “రేవు” సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.
maamovie.com
Review & Rating : 3.25/5