“సీతారామపురంలో ఒక ప్రేమజంట” మూవీ రివ్యూ
నటీనటులుః
రణధీర్ , నందిని
సుమన్, సూర్య, అమిత్ తివారీ, నిట్టల్, మిర్చి మాధవి,
సంధ్య సన్ షైన్, సుష్మా గోపాల్, భాషా, చంద్రకాంత్, బీహెచ్‌ఈఎల్ ప్రసాద్,
లేట్ శివ శంకర్ మాస్టర్, సురేష్..
సాంకేతిక నిపుణులుః
బేనర్ః శ్రీ ధనలక్ష్మీ మూవీస్
డిఓపి: విజయ్ కుమార్ ఎ. ఎడిటింగ్: నందమూరి హరి, ఎన్టీఆర్,
సంగీతం: ఎస్.ఎస్.నివాస్, ఫైట్స్: రామ్ సుంకర,
కొరియోగ్రఫీ: అజయ్ శివ శంకర్, గణేష్, మహేష్,
పిఆర్ఓ: చందు రమేష్,
కథ- కథనం-మాటలు-దర్శకత్వం: ఎం. వినయ్ బాబు
స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ కోవలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం “ సీతారామపురంలో ఒక ప్రేమజంట`. ఈ చిత్రం ఈ రోజు భారీగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. మరి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
కథా కమామీషు:
సీతారామ పురం అనే ఒక గ్రామంలో పటేల్ (సుమన్) అనే ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచ్‌కి నందు ( హీరోయిన్ నందిని) అనే ఒక అందమైన కూతురు ఉంటుంది. అదే ఊరిలో నర్సింహ గౌడ్ (సూర్య)మాజీ సర్పంచ్ కొడుకు శివ (రణధీర్) నందు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ హీరోయిన్ నందుకి మేనబావ ( అమిత్) ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేయాలన్నది పటేల్ ఆలోచన. ఈ క్రమంలో నందు, శివ ల ప్రేమ విషయం పెద్దలకు తెలుస్తుంది. ఇద్దరి ఇంట్లో వార్నింగ్ ఇస్తారు. దీంతో ఒకానొక రోజు హీరో హీరోయిన్ లేచిపోతారు. దీంతో ఇద్దరి ఇంట్లో పెద్దలు రాజీ కొచ్చి .. వెతకడం ప్రారంభిస్తారు. కానీ అప్పటికే నందుతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమిత్ కి అది నచ్చదు . అమిత్ ఎలాగైనా తన మేన మరదల్ని పెళ్లి చేసుకుని పటేల్ ఆస్తి కొట్టేయాలని రౌడీలను తీసుకొని హీరో హీరోయిన్లను వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? హీరో హీరోయిన్లను అమిత్ ఏం చేసాడు? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరో శివ కోసం హీరోయిన్ నందు ఏం చేసింది? అనేది క్లైమాక్స్. మిగతాది థియేటర్ లోనే చూడాలి.
ఆర్టిస్ట్స్:
రణధీర్ తనకు తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడు. ఒక పల్లెటూరి కుర్రాడిగా, లవర్ బాయ్ గా మెప్పించాడు. డాన్స్ ల్లో, ఫైట్స్ లో ఈజ్ కనబరిచాడు. ఒక పల్లెటూరి గడుసుపిల్లగా నందిని మాయ చేసేసింది. తెలంగాణ స్లాంగ్ లో తను చెప్పిన డైలాగ్స్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ కీ వెళ్ళింది. హీరోయిన్ అందంతో పాటు అభినయం ఆకట్టుకుంది. హీరోయిన్‌కి చెప్పిన డబ్బింగ్ కూడా బావుంది. సుమన్, సూర్య, మిర్చి మాధవి పాత్రలు సినిమాకు కీలకం. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్రలు కూడా నవ్విస్తాయి. అమిత్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు.
టెక్నీషియన్స్ పని తీరు:
డైరెక్టర్ వినయ్ బాబు ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా తీశాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బావుంది. దర్శకుడు ఒక మంచి కథ రాసుకోవడంతో పాటు సాంకేతిక నిపుణులు, నటీనటుల దగ్గర నుంచి వర్క్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా తీశాడు.
విశ్లేషణలోకి వెళితే..
ఫస్టాఫ్ అంతా హీరోయిన్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పే డైలాగ్స్ తో , హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ తో ఎంతో ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. సెకండాఫ్ లో వెంట వెంటనే పాటలు రావడం, అనవసరమైన సన్నివేశాలు రావడంతో ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. దర్శకుడు సెకండాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. హీరో హీరోయిన్ లేచిపోవడానికి, వాళ్ల ప్రేమను పెద్దలు కాదడానికి బలమైన సన్నివేశాలు రాయాల్సింది. ఏది ఏమైనా అక్కడక్కడ మినహా దర్శకుడు రెండు గంటలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు అనడంలో సందేహం లేదు. వినసొంపైన పాటలు, అద్భుతమైన లొకేషన్స్, అందమైన హీరో హీరోయిన్ జంట, సినిమాటోగ్రఫీ ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. Maa Movie రేటింగ్ 3/5