“గాలోడు ” మూవీ రివ్యూ !!

బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌
నటీ,నటులు : సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
పి. ఆర్. ఓ : సిద్దు, దుద్ది శ్రీను
సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది . ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. నవంబర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరిలో ఉంటూ జీవితంలో ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా తిరుగుతూ గాలోడు అని పిలిపించుకునే కుర్రాడు.అమ్మా, నాన్న అంటే గౌరవం ఉండదు. కొట్లాటలు, పేకాటలు.. ఇవే ఇతనికి టైం పాస్. ఓ రోజు పేకాటలో ఆ ఊరి సర్పంచ్ కొడుకుతో ఇతనికి గొడవవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు దీనితో భయపడి హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ శుక్లా ( గెహెనా సిప్పి) కి ఓ సాయం చేస్తాడు. దాంతో వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.ఆ తర్వాత తన ఇంట్లోనే డ్రైవర్ గా పెట్టుకుంటుంది.అయితే వీరి ప్రేమ విషయం తెలుసుకున్న శుక్లా తండ్రి వీరి ప్రేమకి ఒప్పుకోడు.
అయితే ఒక రోజు రాజుని వెతుక్కుంటూ పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు? దాంతో రాజు ఆ మర్డర్ నుండి నిర్దోషి గా ఎలా బయట పడ్డాడు?చివరకు శుక్లా ప్రేమను దక్కించుకున్నాడా. ఆనేది తెలుసుకోవాలి అంటే గాలోడు సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
సుదీర్ ఈ సినిమాలో కొత్త లుక్స్ తో డ్యాన్స్ లతో, ఫైట్స్ తో, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే నటుడుగా ఈ సినిమాలో తన నుంచి కొత్త కోణం కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ గెహనా చక్కటి నటనతో ఆకట్టుకుంది.గెహినా లుక్స్ మరియు సుధీర్ తో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. లాయర్ విజయ భాస్కర్ పాత్రలో స‌ప్త‌గిరి బాగా నటించాడు. అలాగే , పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ లకి చ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు రాజశేఖర్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాని తెరకేక్కించడమే కాకుండా సుధీర్ పాత్రను చాలా ఎంగేజింగ్ గా తీయడంలో సక్సెస్ అయ్యాడు.సంగీత దర్శకుడు భీమ్స్ సినిమాకి చాలా మంచి మ్యూజిక్,రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ లు ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు.. డైలాగ్స్ క్యాచీగా వున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది.ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ పతాకంపై దర్శక , నిర్మాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాలోడు సినిమాను ఒక సారి చూడొచ్చు.. మా మూవీ రేటింగ్ : 3/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *