ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒకే ఒక్కరోజు “నువ్వొస్తానంటే…నేనొద్దంటానా”

సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమా “నువ్వొస్తానంటే…నేనొద్దంటానా” ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేగా ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఈ నెల 14న ఒకే ఒక్కరోజు రీ రిలీజ్ కానుంది. తొలిసారిగా 2005వ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అప్పట్లో 175 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శింపబడంతో పాటు ఐదు నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ వంటి పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో లవర్ బాయ్ గా సిద్దార్థ్ కు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో దోహదం చేసింది. అలాగే త్రిష కూడా హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, మంచి నటిగా స్థిరపడేందుకు కారణమైంది. సంతోష్, సిరి పాత్రలతో అలరింపజేసిన వీరిద్దరినీ మళ్ళీ తెరపై చూసే అవకాశం ప్రేక్షకాభిమానులకు కలగబోతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఆద్యంతం అలరింపజేసిన ఈ సినిమాలో త్రిష అన్నయ్యగా రియల్ స్టార్ శ్రీహరి, ఇంకా ప్రకాష్ రాజ్, సునీల్, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, అర్చన వంటి ఆర్టిస్టులంతా తమతమ పాత్రలలో జీవించారు. ప్రభుదేవా దర్శకత్వం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటాయి. ”సంథింగ్ సంథింగ్…”, “చంద్రుల్లో ఉండే…”, “ఘల్ ఘల్…” వంటి పాటలు నాటి నుంచి నేటివరకు అలరింపజేస్తూనే ఉన్నాయి.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *