హైడ్ అండ్ సీక్ టైటిల్ లోగో ను విడుదల చేసిన దర్శకుడు సుధీర్ వర్మ !!!

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాకు హైడ్ అండ్ సీక్ టైటిల్ ను ఖరారు చేశారు. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు
బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్
దర్శకత్వం: బసి రెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి
సినిమాటోగ్రఫీ: చిన్న రామ్
మ్యూజిక్: లిజో కె జోష్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: నిఖిల్ హాసన్
పిఆర్ఒ: శ్రీధర్

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *