శరపంజరం మూవీ రివ్యూ
బ్యానర్ : దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్
సినిమా : “ శరపంజరం”
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 19.04.2024
సహకారం: టి. గణపతిరెడ్డి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌కుమార్ గట్టు,
నటీనటులు: నవీన్ కుమార్ గట్టు, లయ, వరంగల్ బాషన్న, ఆనంద్ భారతి, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ మీల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్, మేరుగు మల్లేశం గౌడ్, కళ్యాణ్ మేజిషియన్ మానుకోట ప్రసాద్, కృష్ణ వేణీ, ఉదయశ్రీ ,రజీయ, ఉషా, సకేత, రాజేష్, సుదర్శన్, నరేందర్, దయ, భరత్ కామరాజు, ప్రసాద్, ప్రశాంత్, అఖిల్ (బంటి)
సంగీతం: మల్లిక్ ఎం.వి.కె.,
కెమెరా: మస్తాన్ సిరిపాటి,
ఎడిటింగ్: యాదగిరి కంజర్ల,
డి.ఐ: రాజు సిందం.
పాటలు: మౌనశ్రీ మల్లిక్,గిద్దె రాం నర్సయ్య,కిరణ్ రాజ్ ధర్మారాపు,అద్వ్కెత్ రాజ్, ఉమా మహేశ్వరి రావుల,
పి.ఆర్.ఓ: ఆర్.కె.చౌదరి,
పూర్వ కాలంలో లలిత కళలు నేర్చుకున్న కొందరు మహిళలు దేవాలయాలు రాజుల కొలువుల్లో నాట్యమాడే వారు వారి పై కన్నేసిన కొందరు పెద్దలు వారిని కామ వాంఛలు తీర్చే వస్తువుగా మార్చుకున్నారు ఆ తర్వాత వీరికి దేవదాసి, జోగిని, మాతంగి పేరు తగిలించి ఊరందరికీ అప్పగించారు.అలామొదలైన జోగిని వ్యవస్థ పై పరిశోధనాత్మక కథగా తీసిన సినిమానే ‘శరపంజరం’ . గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది అనే పల్లెటూరు నే పధ్యంలో సాగే కథాంశంతో తీసిన జీరో బడ్జెట్ సినిమా “శరపంజరం”.మామిడి హరికృష్ణ ఆశీస్సులతో గణపతిరెడ్డి సహకారంతో, దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నవీన్‌కుమార్ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్ గట్టు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..
కథ
శివుడు (నవీన్ కుమార్ గట్టు) ది గంగిరెద్దుల కుటుంబం. తన చిన్నతనంలోనే తమ స్వగ్రామం నుండి బయలు దేరి ఉరూరూ తిరిగి గంగిరెద్దులు ఆడిస్తుంటాడు . మాతంగి (కృష్ణ వేణి) ఆ ఊరికి దేవదాసిగా ఉంటుంది. మాతంగికి పుట్టిన మంజు(లయ) తన చిన్నతనం నుండే స్కూల్ లో, బయట నీ తండ్రి పేరు చెప్పమని అందరూ సూటి పోటీ మాటలతో వేధించేవారు. ఏమీ తెలియని మంజు తన తల్లి దగ్గరకు వచ్చే వారిలో తన నాన్న ఎవరని అడిగేది. దేవుడే మీ నాన్న అని చెప్పడంతో దేవుడిని నాన్నగా పిలిచేది. అయితే మంజు తల్లి మాత్రం తన కూతురును బాగా చూసుకోవాలి తన లాగ తన కూతురు జీవితం కావద్దు అనుకునేది. గంగిరెద్దుల ఆడిస్తూ 12 సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన శివుడు మంజును చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.. కొద్దిరోజుల తరువాత మంజు , శివుడి ప్రేమను అంగీకరస్తుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలను కుంటారు. మరోవైపు మంజును ఎలాగైనా అనుభవించాలకొన్న దొర మంజును జోగినిగా మార్చాలను కుంటాడు. దీనికి ఎదురు తిరిగిన శివుడు, మంజుల పై ఊరు దొర, గ్రామ ప్రజలు ఎలాంటి వ్యతిరేకత చూయించారు. చివరికి దొర, మంజుని ఏం చేశాడు? ఆ ఊరి పెద్దలను ఎదిరించి శివుడు,మంజులు పెళ్లి చేసుకొన్నారా లేదా ? అనేది తెలుసుకోవాలి అంటే ఈ విషాద భరితమైన ఉదాత్త ప్రేమ కథ “శరపంజరం” సినిమాను కచ్చితంగా థియేటర్ కెళ్ళి చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
కథానాయకి మంజు పాత్రలో నటించిన లయ పల్లేటూరి అమ్మాయిలా తన అందం అభినయంతో అద్భుతంగా నటించి మెప్పించింది. హీరో పాత్రలో శివుడి గా నటించిన నవీన్ కుమార్ గట్టు పెద్ద హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. తను చేసిన గంగిరెద్దుల ఆటతో గొప్ప సాహసమే చేసాడు తన గంగిరెద్దుల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దొర పాత్రలో నటించిన వరంగల్ భాష తన క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనే మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించాడు. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ అతిధి పాత్రలో తళుక్కున మెరిసి తన నటనతో విస్మయానికి గురి చేస్తారు.ఇంకా ఈ సినిమాలో జబర్దస్త్ కళాకారులు జీవన్, రాజమౌళి, వెంకీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అలువాల సోమన్న, మేరుగు మల్లేశం, మానుకోట ప్రసాద్, ఆనందభారతి, ఉదయశ్రీ ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ గట్టు జోగిని వ్యవస్థ పై, మరియు గంగిరెద్దుల వారి జీవన విధానం తెలుపుతూ .తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తు చేస్తూనే 1990 ప్రాంతంలో తెలంగాణలో ఉండే పెత్తందారీ వ్యవస్థ ఆగడాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక సినిమా థియేటర్లో ఉన్నామన్న భావన కలగదు. తెలంగాణలోని ఒక పల్లెలో సంచరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాను మల్లిక్ ఎం.వి.కె. సంగీతం నిలబెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. పాటల విషయానికి వస్తే, ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుండటం విశేషం. ప్రతి పాట సన్నివేశానికి తగినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా పేర్లు పడేటప్పుడు ‘కాటిలో పేర్చిన కట్టే నీతొ రాదు’, ‘నీలాల నీ కళ్ళు’, ‘సోయిసొప్ప లేకుండా’ అనే పాటలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులను తన్మయత్వానికి లోనవుతారు. మస్తాన్ సిరిపాటి ఈ సినిమాకు ఛాయాగ్రహం అందించారు. ఈ సినిమాలో 4:45 సెకండ్ల సింగిల్ టేక్ సీన్ జోగిని తాలుకు జీవితాన్ని ప్రతిబింబించే లాగా ఉంటుంది. ప్రతి సీన్ అందంగా ఉంటుంది. తొలి చిత్రంతోనే ప్రతిభావంత మైన కెమెరామెన్ అనిపించుకున్నాడు. యాదగిరి కంజర్ల ఎడిటింగ్ పనితీరు బాగుంది. టి.గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.తన ఫ్రెండ్స్ సహకారంతో తను అనుకున్న లక్ష్యం కోసం బడ్జెట్ లేకుండా జీరో బడ్జెట్ సినిమా తీసి, మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నవీన్ కుమార్ గట్టు పెద్ద సినిమాలు తీయగలడని మనకు అర్థం అవుతుంది. తెలంగాణలో దొరల బానిసత్వం గురించి తెలుపుతూ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నివ్వడమే కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో ‘శరపంజరం’ ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు.
maamovie.com Rating 3.25/5