మౌళిక వ‌స‌తుల రూప‌క‌ల్ప‌న‌తోనే స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు
జ‌న సాంద్ర‌త‌, ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌పై దృష్టి పెట్టాలి – తెలంగాణ డెవ‌ల‌వ‌ర్స్‌ అసోసియేష‌న్


హైదరాబాద్: పుర‌పాలిక‌లో చేరిక‌ల‌తో విస్త‌రించ‌నున్న హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దిలో స‌వాళ్లను అధిగ‌మించాలంటే మౌళిక వ‌స‌తుల రూప‌క‌ల్ప‌న ఎంతోముఖ్య‌మ‌ని ప‌లువురు వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న సాంద్ర‌త‌కు అనుగుణంగా ర‌వాణా, తాగునీటి, మురుగునీటి, విద్యుత్‌, శాంతిభద్ర‌త‌ల వ్య‌వ‌స్థ‌లు విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా మార్చే క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల పార్టీల అభిప్రాయాల‌ను, ప్ర‌జాభిప్రాయాల‌ను ఖ‌చ్చితంగా అధికార పార్టీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్ వార్షిక స‌మావేశాన్ని ఆదివారం బంజారాహిల్స్‌లోని ఒక హోట‌ల్‌లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి విశ్రాంత ఐఏఎస్‌లు ఎస్‌.కె. జోషి, ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం, అర్బ‌న్ ఎక్స్‌పర్ట్ మ‌హీప్ సింగ్ థాప‌ర్‌, సెక్యూరిటీ ఎక్స‌ఫ‌ర్ట్ డాక్ట‌ర్ కె. ర‌మేష్ బాబు, తెలంగాణ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జీవీ రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా IAS రిటైర్డ్,
మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో జ‌ల‌మండ‌లి, ఏపీఐఐసీ త‌దిత‌ర కీల‌క‌మైన విభాగాల్లో ప‌నిచేసిన అనుభ‌వంతో చెబుతున్నాను. న‌గ‌ర విస్త‌ర‌ణలో అనేక స‌వాళ్లు ఉంటాయి. వాటిని ఖ‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌తో ఎదుర్కోవాలి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు దృష్టిలో పెట్టుకొని అభివృద్దిని, ఆలోచ‌న‌ల‌ను చేయాలి. గ‌తంలో అవుటర్ రింగ్ రోడ్డు, ర‌హేజా ప్రాజెక్టు, గ‌చ్చిభౌళి స్పోర్ట్స్ ప్రాజ‌క్టు విష‌యంలో నును గ‌మ‌నించాను. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు విచిత్ర‌మైన వాద‌న‌లు వినిపించారంటూ గుర్తుచేశారు. అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ అనేది అతిపెద్ద స‌వాల్‌. అంద‌రం వ‌ర్త‌మాన కాలం గురించి ఆలోచ‌న చేస్తాం. రేప‌టి సంగ‌తి గురించి ఆలోచించం, నాలుగు రూపాయ‌లు, నాలుగు ఓట్లు ప‌డితే స‌రిపోతుంద‌ని ఆలోచిస్తాం. సాహ‌సంతో ముందుకు అడుగు వేయాలి, కొంత త్యాగ‌బుద్ది ఉంటే సుస్థిర‌మైన అభివృద్ది సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌పంచంలో అ్య‌త‌ధిక జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌టిగా ఉంది. అర్బ‌న్ ఏరియాలో మ‌నం జీవించాలంటే ప‌ర్ క్యాపిటా ఖ‌ర్చు చాలా ఎక్కువ. ఎవ‌రూ దాని గురించి మాట్లాడ‌రు. అర్బ‌న్ ఏరియా పెంచేకొద్ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే దానికి కావల్సిన వ్య‌క్తిగ‌త ఖాతా నుంచి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది. ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారిన త‌రువాత వ‌చ్చిన అనుభ‌వాల‌ను క‌లిపిన ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ది చెందాయో గ‌మ‌నించాలి. న‌గ‌రానికి రావ‌డానికి స‌రైన సౌక‌ర్యాలు కావాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే చాలా న‌గ‌రాలు ఇదే త‌ర‌హా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. రాజ‌కీయ పార్టీల్లోనూ ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండాలి. ఇలాంటి బృహ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో వారి భాగ‌స్వామ్యం ఎంతో ముఖ్యం.

IAS రిటైర్డ్,
మాజీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ.. అత్యంత జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో ఢిల్లీ, కోల్‌క‌త్తా, ముంభై, చెన్నై త‌రువాత హైద‌రాబాద్ ఉంద‌న్నారు. కొత్త‌గా చేరిన పుర‌పాలిక‌ల‌తో ఇప్పుడు న‌గ‌ర విస్త‌ర్ణం చాలా పెరిగింద‌న్నారు. దాదాపు 2వేల కిలోమీట‌ర్ల‌లో న‌గ‌రం విస్త‌రించ‌నుంద‌న్నారు. అమ‌రావ‌తి సైతం ఇప్పుడు అదే త‌ర‌హాలో విస్త‌రిస్తుంది. అయితే సాంకేతిక‌త‌ను, ఐఐను వినియోగించుకోవ‌డంతోపాటు భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్నారు. అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ర‌వాణా వ్య‌వ‌స్థ‌, ప్ర‌జ‌ల జీవ‌న‌శైలికి అనుగుణంగా అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌పై దృష్టి పెట్టాలి. న‌గ‌రంలోకి తేలిక‌గా వ‌చ్చి వెళ్లేలా అనుసంధానం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రీన్ ఏరియాల‌ను పెంచ‌డంతోపాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై దృష్టి పెట్టాలి.

తెలంగాణ డెవ‌ల‌వ‌ర్స్‌ అసోసియేష‌న్ అధ్యక్షుడు జీవీ రావు మాట్లాడుతూ.. హైద‌రాబాద్ లో ఈ ఏడాది 70 వేల ఫ్లాట్లు విక్ర‌యించాం. ప్ర‌తి ఏడాది 6 శాతం గ్రోత్ ఉంటుంది. ఇది దేశంలో రెండొ స్థానంలో ఉంది.
ప్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళిక విషయానికి వస్తే, ముందుగా 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఉండాలని మేము సూచిస్తున్నాము. పరిశ్రమలకు అనుకూలంగా అవసరమైన అన్ని మౌలిక వసతులు, అలాగే భవిష్యత్ జనసాంద్రతను అంచనా వేస్తూ పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఈ విధంగా అభివృద్ధి చేసిన 50 చదరపు కిలోమీటర్ల నగరం, మిగతా ప్రాంతాలు రంగాల వారీ (సెక్టోరల్) వృద్ధికి దోహదపడుతుంది. ఇలాంటి అభివృద్ధి నమూనానే నవి ముంబయి అభివృద్ధిలో అనుసరించారని అన్నారు.
పూణేలో దాదాపు ల‌క్ష ఇళ్లు విక్ర‌యిస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన వేలం విక్ర‌యాలు రానున్న రోజుల్లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ తీరును మ‌రింత పెంచేలా స్ప‌ష్టం చేస్తున్నాయి. హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ఎంతో న‌మ్మ‌క‌మైన‌ది. ఇక్క‌డ నాణ్య‌మైన ఫ్లాట్లు ల‌భిస్తాయి. వాటిని అందించ‌డంలో ఇంకా మెరుగైన తీరు అవ‌స‌రం ఉంది.

పెరుగుతున్న జ‌నాభా, ప్ర‌జావ‌స‌రాల‌కు అనుగుణంగా న‌గ‌ర విస్త‌ర్ణ నిర్మానం ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నాం. అందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాల‌ను ప్ర‌భుత్వానికి అందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను త‌యారు చేసి నివేదిస్తాం. జ‌న సాంద్ర‌త‌, ప్ర‌జా ర‌వాణాను ప్ర‌ధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. స్క్వేర్ కిలోమీట‌ర్‌కు ఎంత‌మంది ఉంటారు, అందుకు త‌గిన ఏర్పాట్లు ఎలా చేయాల‌నే అంశంపై ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త ఉండాల‌న్నారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *