స్వామి ముద్దంకు బెస్ట్ ఏఐ మీడియా అవార్డు!
హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నలిజం రంగంలో పరిశోధనలు, సేవల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన జర్నలిస్ట్ స్వామి ముద్దం కి ప్రతిష్ఠాత్మకమైన ‘ఏఎన్ఎన్ మహా అవార్డు’ లభించింది. ఈ అవార్డును ‘ఏఎన్ఎన్ మహా’ సంస్థ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, సీఈవో కంది రాంచంద్ర రెడ్డి అందించి సత్కరించారు. సోమాజిగూడలోని కత్రియా హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో నరసింహ స్వామి ముద్దం చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఈ గౌరవాన్ని అందుకోవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్న స్వామి ముద్దం
, ఈ గుర్తింపు ఇచ్చిన ‘ఏఎన్ఎన్ మహా’ సంస్థ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, సీఈవో కంది రాంచంద్ర రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
