ప్రముఖ నిర్మాత టి.ఎఫ్.డి.సి. చైర్మన్ దిల్ రాజుతో భేటి అయిన “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్”

ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” కొత్త కార్యవర్గంతో కొలువుదీరడం తెలిసిందే. అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచేలా ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తూ… త్వరలో “డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్” (60 ఏళ్ల సంబరాలు) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం… ప్రముఖ నిర్మాత, మరియు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది!!

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇస్తున్న “గద్దర్ అవార్డ్స్” వేడుకను ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహించడంలో… టి.ఎఫ్.డి.సి. చైర్మన్ హోదాలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజును ఈ సందర్భంగా అభినందించింది. సోలోగా హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో తను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను కార్యవర్గ సభ్యులతో ఆయన పంచుకున్నారు.

దిల్ రాజును కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీలు పర్వీన్, శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు, ధీరజ అప్పాజీ, కుమార్ మరియు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వాసు ఉన్నారు!!

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *