దగ్గుపాటి సురేష్ బాబు గారి  చేతుల మీదుగా “మన్యం రాజు ” టీజర్ రిలీజ్

జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మన్యం రాజు  వాయుపుత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.  రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది.

సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి  మరియు డైరెక్టర్ కి ,  మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను.
హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరో జీవన్  గారు మాట్లాడుతూ సురేష్ బాబు  గారి  చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది .  సినిమా చాల బాగా వచ్చింది. మీకు తప్పకుండ నచ్చుతుంది అని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన  మా ప్రొడ్యూసర్ గారికి  , మరియు డైరెక్టర్ సోము గారికి  థాంక్స్ చెప్తూకుంటున్నాను.

దర్శకుడు సోమసుందరం.బి యమ్, మాట్లాడుతూ ” మా సినిమా టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు , కష్టపడి సినిమా చేశాం . టీజర్ కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.  మా హీరో జీవన్ , గారు మరియు ప్రొడ్యూసర్  గారు  ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను ” అని అన్నారు. నా నా మీద నమ్మకం తో  ఈ అవకాశాన్ని  ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను.

ప్రొడ్యూసర్స్ విజయ్ బాబు , ప్రవీణ్ , భీమాస్ అశోక్  వారు  మాట్లాడుతూ ” సురేష్ బాబు  గారి చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందం గా ఉంది.  మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా , జీవన్ గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం” అని అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని  మే  లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము.  ఈ కార్యక్రమ లో పరిపూర్ణానంద స్వామి గారు ,యం వి వి సత్యనారాయణ గారు , సప్తగిరి ప్రసాద్ గారు , లయన్ వెంకట్ గారు ,ప్రద్యుమ్న గారు పాల్గొన్నారు .

సుమన్,జీవన్ ,భీమాస్ అశోక్ , జయచంద్ర , బేబీ పరిణిక, తదితరులు నటిస్తున్నారు .

డైరెక్టర్ : సోమసుందరం బి యమ్,
ప్రొడ్యూసర్ : వై ప్రవీణ్ , విజయ్ బాబు , పుష్పలత. బి
మ్యూజిక్ డైరెక్టర్ : ఫ్రాంక్లిన్ సుకుమార్
కెమెరా మెన్ : రమేష్ మెండే, కృష్ణ వంశీ .
కో – ప్రొడ్యూసర్స్  : భీమాస్ అశోక్ , వంశి పాలకూరు, మురళి ప్రసాద రావు,
కోరియోగ్రాఫర్ : పవన్ విక్కీ
పి ఆర్వో : శ్రీపాల్ చొల్లేటి

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *