హర్రర్‌, థ్రిల్లర్‌ అండ్ ఎమోషనల్‌ “కలశ ’ మూవీ రివ్యూ !!!

 

సినిమా : “కలశ “
విడుదల తేదీ : 15.12.2023
రివ్యూ రేటింగ్ : 3.5 /5
బ్యానర్: చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌
ప్రొడ్యూసర్: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం:కొండా రాంబాబు

నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు

సినిమాటోగ్రఫీ:వెంకట్‌ గంగధారి
సంగీతం: విజయ్‌ కురాకుల
ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ
పి. ఆర్. ఓ : సతీష్. కె

 

చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15న గ్రాండ్‌గా .ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హర్రర్‌, ఎమోషనల్‌ మూవీ “కలశ ’ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ :
కలశం అనేది స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరు. అలా స్వచ్ఛమైన, పవిత్రమైన క్యారెక్టర్‌ చుట్టూ అల్లుకున్న కథే ‘కలశ’ చిత్రం. అటువంటి పవిత్రమైన కలశాని(బ్రెయిన్‌)కి దుమ్ముపడితే మళ్లీ స్వచ్ఛమైన స్థితికి రావాలంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నది ‘కలశ’ కథ. ఈ పాయింట్‌కు ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా మలుచుకుని ఓ అమ్మాయి జీవితంలోకి ఒక మారు తల్లి, తండ్రి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పటి వరకూ నాన్నను చూసుకున్న ‘కలశ’ అనే అమ్మాయి సడన్‌గా తండ్రి స్థానంలోకి మారు తండ్రి వస్తే ఆ అమ్మాయి మెంటల్‌గా ఎలా డిస్ట్రబ్‌ అయ్యింది.. పెరిగి పెద్దయిన తర్వాత అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురైతే ఆమె దాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంది? అనే దాన్ని హర్రర్‌ టచ్‌తో గ్రిప్పింగ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లేతో క్లైమాక్స్‌ వరకూ సస్పెన్స్‌ను మెయిటైన్‌ చేస్తూ నడిపించారు దర్శకుడు. సహజంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో సస్పెన్స్‌ వీడిపోయిన తర్వాత.. క్యారెక్టర్స్‌ రివీల్‌ అయిపోవడంతోనే సినిమా అయిపోతుంది. కానీ ‘కలశ’లో మాత్రం సస్పెన్స్‌, క్యారెక్టర్స్‌, అసలు విలన్‌ ఎవరు అనేది రివీల్‌ అయిన తర్వాత కూడా దాదాపు 40 నిముషాలు కథ సాగడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడే దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే .. బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. యంగ్‌ డైరెక్టర్‌ తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక కలశ పాత్రలో నటించిన సోనాక్షి వర్మ.. చుట్టూనే సెకండాఫ్ నడుస్తుంది. ఆమె తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. అన్షు రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నికల్ విషయాలను చూస్తే విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం బావుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ ను స్థాపించారు. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికింది అని చెప్పాలి. వీరి బ్యానర్ లో వచ్చెసినిమాలు మరింత వినూత్నంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు అని అనిపిస్తుంది.

MaaMovie.Com Review Rating .. 3.5/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *