ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్ . గోపాల్ రెడ్డి విడుదల చేసిన అరంగేట్రం ఫస్ట్ లిరికల్ సాంగ్
మహీ మీడియా వర్క్స్ బ్యానర్లో మహేశ్వరి .కె నిర్మాతగా ‘కవచం’ సినిమాతో మాస్ హిట్ అందుకున్న ‘శ్రీనివాస్ ప్రభన్’ దర్శకత్వంలో వస్తున్న మరో ఇంట్రస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ అరంగేట్రం. మే 5 న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్. గోపాల్ రెడ్డి
అరంగేట్రం లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన గోపాల్ రెడ్డి గారు చిత్ర యూనిట్ కు అల్ బెస్ట్ చెప్పారు ..అంతే కాకుండా , విజువల్స్, కంటెంట్ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. అలాగే సినిమా పెద్ద హిట్ కావాలి అని ఆశ్వీరదించారు . సినిమాటోగ్రఫీ అందించిన సలీంకు ప్రత్యేకించి మెచ్చుకోవడం జరిగింది…గోపాల్ రెడ్డి గారి శిష్యుడు సలీం ఈ సినిమాకు కెమొరామెన్ గా చేయడం జరిగింది.
నాట్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆరుగురు కొత్త అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు దర్శకుడు ‘శ్రీనివాస్ ప్రభన్’ . ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ రావడంతో నిర్మాతలు మరియు చిత్ర యూనిట్ అంతా చాల ఖుషీ గా ఉన్నారు.
ఈ సినిమాలో రోషన్, శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా , అనిరుధ్, పూజ, లయ, కీర్తన, ఇందు, సాయిశ్రీ , విజయ, శ్రీవల్లి, జబరదస్త్ ఫేం సత్తిపండు కీలకపాత్రలు పోషించారు.
కథ- స్ర్రీన్ ప్లే- దర్శకత్వం – శ్రీనివాస్ ప్రభన్
నిర్మాత – మహేశ్వరీ కె
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్-పోలూరి బ్రదర్స్
కో- ప్రోడ్యూసర్- విజయలక్ష్మి
సంగీతం – గడియన్ కట్టా
కో-డైరెక్టర్- చిన్నం రమేష్ బాబు
పిఆర్ఓ- ప్రైడే పోస్టర్ నాగేశ్వరరావు