జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి

జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలకమండలి తెలంగాణ ప్రెస్ అకాడమి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్దిని కలిసి వినతి పత్రం సమర్పించటం జరిగింది. ఈ విన్నపానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ… పది సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్థు లకు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కు అర్హులు అని అన్నారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల లో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అర్హతలు కలిగిన ప్రతీఒక్క సినిమా పాత్రికేయులు ప్రభుత్వం నిర్ణయించిన వారిని సంప్రదించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్ది, యం.డి. అబ్దుల్, జాయింట్ సెక్రటరీ లు శ్రీమతి పర్వీన్, ఆర్. శ్యామ్ కుమార్ కోశాధికారి భరధ్వాజ్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు.

