అందరికి నచ్చే విలేజ్ డ్రామా ” రుద్రం కోట ” మూవీ రివ్యూ!!!

సమర్పణ : సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత‌,
బ్యానర్ : ఏఆర్ కె విజువ‌ల్స్
సినిమా : “రుద్రంకోట‌”
రివ్యూ రేటింగ్ : 3.25 /5
విడుదల తేదీ: 22-09-2023
నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి;
స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం : రాము కోన‌.
న‌టీన‌టులు : సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత‌,అనీల్‌, విభీష‌, ఆలేఖ్య‌, బాచి, ర‌మ్య త‌దితరులు
డి.ఓ.పీ : ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌;
సంగీతం : సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్‌;
ఎడిట‌ర్ : ఆవుల వెంకటేష్‌;
కొరియెగ్ర‌ఫీ : కీర్తి శేషులు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ , సుచిత్ర చంద్ర‌బోస్;
ఫైట్స్ : జాషువా;
డైలాగ్స్ : రంగ‌;
లిరిక్స్ : సాగ‌ర్‌;
డిజైన‌ర్ : వివా రెడ్డి;
పీఆర్ ఓ : చంద్ర వ‌ట్టికూటి, మోహ‌న్ తుమ్మ‌ల‌, జీకే మీడియా

రుద్రం కోట కథ‌…
రుద్రంకోట ఊరిలో క‌ట్టుబాట్ల‌ను ఎవ‌రూ మీర‌కుండా కోట‌మ్మ (జ‌య‌ల‌లిత‌) కాప‌లాగా ఉంటుంది. ఊరిలో ఆమె చెప్పిందే వేదం. నిజాయితీ తో కూడిన‌ ప్రేమికుల్ని కోట‌మ్మ క‌లుపుతుంటుంది. త‌ప్పుడు బంధాలు బ‌తుకులో చీక‌ట్ల‌ను నింపుతుంటాయ‌ని న‌మ్ముతుంటుంది.

అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న వాళ్ల‌ను, కామాంధుల‌ను కోట‌మ్మ ఆజ్ఞ‌తో రుద్ర (అనిల్ ఆర్కా) కాటికి పంపుతుంటాడు. ధృతి (అలేఖ్య‌) రుద్రంకోట‌లో అడుగుపెట్ట‌డంతో ఊరిలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి. ధృతి ఎవ‌రు? కోట‌మ్మ‌తో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది. ఊరి జ‌నాల‌కు దూరంగా రుద్ర స్మ‌శానంలో బ‌త‌క‌డానికి కార‌ణం ఏమిటి? రుద్ర‌ను ప్రేమించిన శ‌క్తి (విభీషా) ఏమైంది? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

న‌టీన‌టుల పనితీరు
కోట‌మ్మ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత న‌టించిన తీరు అద్భుతం. తన నటనతో కోటమ్మ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది.అమ్మాయిలంటే గిట్ట‌ని పాత్ర‌లో రుద్ర ఒదిగిపోయాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయినా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. రుద్రం కోటలో మేకలు కాసే పల్లెటూరు అమ్మాయిగా,మరియు అమ్మాయిలంటే పడని రుద్రను ప్రేమిస్తున్న అమ్మాయిగా శక్తి పాత్రలో( విభీష‌) చక్కని నటనను ప్రదర్శించింది. సిటీ నుండి వచ్చిన ఆధునిక యువతి పాత్రలో దృతి (అలేఖ్య‌) తన నటనతో పాటు అందం అభినయంతో ఆకట్టుకుంది.ఇలా హీరోయ‌న్స్ శ‌క్తి, విభీష ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. ప్ర‌తి పాత్ర సినిమాకు కీల‌కంగా ఉంటుంది. మాటలు రాని వ్యక్తిగా భాస్కర్ రావు, కోటమ్మకు సేవకురాలుగా రాణి పాత్రలో రమ్య ఇలా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు సాయి కోనకు ఇది తొలి సినిమా అయినప్పటికీ
రూరల్ బ్యాక్ డ్రాప్ లో అంతా కొత్తవాళ్ళతో రా రస్టిక్ వంటి కథను సెలెక్ట్ చేసుకొని నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి జీవితాలను ఎలా మోసం చేసుకుంటున్నారు.కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు దాని వలన జరిగే పరిణామాలు ఏంటి? అంటూ ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ కు ఆసక్తికర సన్నివేశాలను జోడించి ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా కొనసాగిస్తూ చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకులు సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్ లిచ్చిన సంగీతం బాగుంది. కీర్తి శేషులు శివ శంక‌ర్ మాస్ట‌ర్ శ్మ‌శాన వాటిక‌లో సాగే నరనరమున కాగే.. వంటి రొమాంటిక్ సాంగ్ తో పాటు క్లైమాక్స్ లో వ‌చ్చే హారో.. హారా.. దిగంబరా.. అని శివ‌తాండ‌వం చేసే పాటకు అద్భుతమైన కొరియోగ్ర‌ఫీ చేశారు. వెయ్ వెయ్ వెయ్ రా చిందేయ్ రా.. అను పాట, ఆ నింగి సినుకే జారీ ఈ నిప్పు కానికేను జేరి చుట్టరికం జేసిందే..అంటూ సాగే ఎమోషనల్ సాంగ్, కళ్ళతో కాటేసినావే.. కౌగిలే కాజేసినావే .అనే పాటతో పాటు ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా స్విచ్వేషన్ కు తగ్గట్టు ఉన్నాయి.
ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌ అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.పల్లె అందాలను చాలా చక్కగా చూయించాడు. ఆవుల వెంకటేష్‌ ఎడిటింగ్ పనితీరు బాగుంది. సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌ణలో ఏఆర్ కె విజువ‌ల్స్ పతాకంపై అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి లు నిర్మాతలుగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలున్నాయి ఇది ల‌వ్ అండ్ ల‌స్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పొచ్చు. అండ‌ర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందించారు . అదేంటో తెలుసుకోవాలి అంటే తప్పకుండా “రుద్రం కోట” సినిమా చూడాల్సిందే!!!

మామూవీ.కామ్ రేటింగ్ : 3.25/5
maamovie.com Rating : 3.25/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *