ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో F1 హాలీవుడ్ మూవీ సమీక్ష

వేగానికి మరో పేరు ఏమిటి అంటే చాలామంది “ఫార్ములా 1” అంటారు. ఆ వేగం, ఆ థ్రిల్, ఆ అడ్రినలిన్ రష్ను వెండితెరపైకి తీసుకొచ్చిన అద్భుతమైన చిత్రం F1. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా కేవలం కార్ల రేసింగ్ గురించే కాదు… కలల గురించి, ఓటమి తర్వాత తిరిగి లేచే ధైర్యం గురించి, అనుభవం మరియు యువత మధ్య జరిగే పోటీ గురించి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించారు.
సినిమా కథ గురించి చేపుకుంటే బ్రాడ్ పిట్ “సన్నీ హేస్” అనే మాజీ F1 డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఒకప్పుడు ట్రాక్‌పై మెరుపులు మెరిపించిన అతను, అనుకోని పరిస్థితుల వల్ల రేసింగ్ ప్రపంచానికి దూరమవుతాడు. కానీ జీవితం ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది అంటారు కదా! ఏళ్ల తర్వాత ఒక కొత్త టీమ్‌ను గెలుపు బాట పట్టించేందుకు మళ్లీ ట్రాక్‌పైకి వస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన ప్రయాణం…అనుభవం వర్సెస్ యువత… ఓటమి వర్సెస్ ఆత్మవిశ్వాసం… భయం వర్సెస్ కలల అనుభవాలతో హీరో ఎలా మారాడు అనేది చూడాలి.

ఈ సినిమా ప్రత్యేకతలు గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే…ఇందులోని అనేక సన్నివేశాలు నిజమైన F1 రేసుల సమయంలో చిత్రీకరించబడ్డాయి. అందుకే ప్రేక్షకులకు సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే…నేరుగా రేస్ ట్రాక్‌లో కూర్చుని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కెమెరా వర్క్, విజువల్స్, సౌండ్ డిజైన్…ప్రతి అంశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. హీరో బ్రాడ్ పిట్ గురించి చెప్పాలంటే హాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అతను, ఈ సినిమాలో కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అతని వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ…అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించారు.
సినిమా పేరైన ఫార్ములా వన్ అంటే ఏమిటని చాలామందికి తెలిసి ఉండొచ్చు…తెలియని వారి కోసం చిన్న పరిచయం. ఫార్ములా వన్ అనేది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మోటార్ స్పోర్ట్. ఒక సెకను తేడా విజయం-పరాజయాలను నిర్ణయిస్తుంది. డ్రైవర్ ప్రతిభ, ఇంజినీరింగ్, వ్యూహం…ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది.
ఈ అంశాలన్నింటినీ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు.
ఈ సినిమా మనకు చెప్పే పెద్ద సందేశం ఏమిటంటే…”కలలకు వయస్సు ఉండదు.”ఎన్ని సార్లు ఓడిపోయినా…మనపై మనకు నమ్మకం ఉంటే మళ్లీ గెలవొచ్చు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు… మనల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన అవకాశమే అని చెబుతుంది. రేస్ ట్రాక్‌పై గెలవడం ఎంత కష్టమో…జీవితంలో గెలవడం కూడా అంతే కష్టం.కానీ ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగితే…ఫినిషింగ్ లైన్ మనదే అవుతుంది. అదే సందేశాన్ని అందంగా, ఉత్కంఠభరితంగా చూపించిన చిత్రం F1.
